వార్సా : ఓడించి సాధించేది పతకం... హృదయంతో గెలిచేది ప్రేమ... ఈ రెండిటినీ సొంతం చేసుకున్నవాడు పియోటర్ మలచౌస్కీ. ఆయన చేస్తున్న త్యాగానికి మానవత్వం ఉన్నవాళ్ళంతా జేజేలు పలుకుతున్నారు. నిజమైన హీరో అంటే పియోటరేనని ప్రశంసలందుకుంటున్నాడు. ఒలింపిక్స్‌లో గెలవడమంటే మాటలు కాదు కదా! పోలండ్‌కు చెందిన డిస్కస్ త్రోయర్ పియోటర్ మలచౌస్కీ రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. దానిని వేలానికి పెట్టాడు. ఎందుకో తెలుసా? మూడేళ్ళ బాలుడికి కంటి కేన్సర్ ఉందని తెలిసిన వెంటనే మరో ఆలోచన లేకుండా తన రజత పతకాన్ని వేలానికి పెడుతున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
Newer Post
Older Post
Home