ఏపీకి ప్రత్యేక హెదాతో పాటు రాష్ట్రం అభివృద్ధిచెందే వరకు కేంద్రం ఆదుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. హారతి కార్యక్రమం అనంతరం చంద్రబాబు మాట్లాడారు.విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి తీరాల్సిందేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఒక్క ప్రత్యేక హోదానే కాకుండా ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు సాయం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ప్రపంచంలోని టాప్-10 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిలబెడతామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.
Newer Post
Older Post
Home