కొలంబో: ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్‌లో హ్యాట్రిక్ రికార్డ్ నమోదయ్యింది. ఆసిస్ బౌలర్ జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్ సాధించాడు. 45వ ఓవర్ చివరి బంతికి కుశాల్ పెరారాను ఎల్బీడబ్లూగా ఔట్ చేశాడు ఫాల్కనర్. తర్వాత మళ్లీ 48వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చి మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ వికెట్ల ఫీట్‌ను సాధించాడు. రెండు వరుస బంతుల్లో లంక కెప్టెన్ మాథ్యూస్, తిషార పెరారలను ఔట్ చేశాడు. అయితే ఈ క్రమంలో వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన 6వ ఆసిస్ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అయితే శ్రీలంకపై మాత్రం ఆసిస్ బౌలర్లకు ఇది రెండో హ్యాట్రిక్. అంతకుముందు డానియేల్ క్రిస్టియన్ లంక జట్టుపై వన్డేల్లో హ్యాట్రిక్ సాధించాడు. స్కోర్ వివరాలు: శ్రీలంక 48.5 ఓవర్లలో 288/10.(శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది)
Newer Post
Older Post
Home