చాలామంది ఎత్తుగా తక్కువగా ఉన్నామని కుమిలిపోతుంటారు. దీనికి ముఖ్య కారణం వయసులో ఉన్నపుడు సరైన ఆహారం లేక కొంతమంది, హార్మోన్స్ లోపం వలన కొంతమంది సతమతమవుతుంటారు. వయసు మీద పడ్డాక ఎత్తు పెరగాలని చాలామంది ప్రయత్నం చేసి విఫలం అవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు...
బెండకాయ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో సహజసిద్ధమైన కూరగాయ బెండకాయ. దీంట్లో విటవిన్లు, ఫైబర్, పిండిపదార్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బచ్చలికూర ఎత్తు పెరగడానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. దీనిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండడంతో ఎత్తు బాగా పెరుగుతుంది.
రోజూ వారీ డైట్‌లో బఠానీ గింజలను తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫైబర్, ప్రోటిన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉండడం వల్ల ఎత్తు పెరుగుతుందని అంటున్నారు.
అరటిపండులో చాలా గుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్‌లాస్ కూడా తగ్గుపోతుంది. సోయాబీన్ ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. రోజు 50గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఎత్తు పెరిగే అనవకాశఖఉంటాయి. రోజూ ఒక గ్లాస్ పాలు సేవించడం వల్ల ఎత్తు పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు