నేడు రాజ్యసభలో జియస్టి : చర్చ ఎపి బాధలు పట్టించుకోకుండా అర్ధవంతంగా నుడుస్తుంది. ప్రశాంతంగా ఉంది. ఇలాంటివి తెలంగాణ ఉద్యమం అప్పుడు వస్తే ఎలా ఉండేదో మనం అర్ధం చేసుకోగలం. - వస్తువుల, సేవల పన్ను (గూడ్స్ & సర్వీసెస్ టాక్స్) సరళీకృతం మంచిదే. కానీ బిల్లు రూపకల్పన చూస్తే ఎప్పుడూ రాష్ట్రాలు కేంద్రాన్ని అడుక్కుని బ్రతికేవిగా తయారుచేయడానికన్నట్లు కొన్ని జాతీయపక్షాల కుట్ర బయటపడుతుంది. ఎపి, తెలంగాణ, తమిళనాడు ఆర్దికమంత్రులు ప్రకటనలు, వామపక్షాల ఘోష కూడా గమనించాలి. ఎప్పుడో ఇవ్వాల్సిన సియస్టి బకాయలు సంవత్సరాలు గడిచినా, నేటికీ ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రాలను ఏడిపిస్తూండటం గమనిస్తే వారి భవిష్యత్తు ‘వాడకం’ ఎలా ఉంటుందో, రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా ఎలా తొక్కిపెట్టబోతున్నారో అర్ధం అవుతుంది. - ఇక ఎపికి విభజన హామీలకోసం ఇప్పుడు బిల్లుకి అడ్డం పెట్టటం లేదా ప్రత్యేకహోదాకు మినహాయింపులు బిల్లులో సవరణ ముందుగా అడగడం సరైనది. నాకు బాధపడుతున్న ఆంధ్రావారు, ఇబ్బందులు పడబోతున్న భావితరాల వారు ముందు కనపడుతున్నారు. అవును ‘వారి’ భాషలో చెప్పాలంటే నేను తెలుగోళ్ళ, గట్టిగా చెప్పాలంటే ఆంధ్రోళ్ళ పక్షపాతిని. ఈ బిల్లు విషయంలో ఎపి వారి పాత్ర చాలా ముఖ్యం. మనకు తక్షణము న్యాయం జరుగుతుందో లేదో దెబ్బకి తేలిపోతుంది. అలాగే దాన్ని ఆమోదిస్తూ ఆంధ్రావారు ఒక్కరు ఓటేసినా ఆంద్ర ద్రోహులే –